‘3’ ఎందుకు విఫలమైంది? Why ‘3’ failed?

Harish Parthu
6 min readNov 15, 2020

(The English translation of this article is attached below)

(గమనిక: నేను ఈ విశ్లేషణ రాయటం వెనకున్న ఉద్దేశం నాకు ఈ సినిమా రచయిత్రి, దర్శకురాలి కంటే ఎక్కువ తెలుసని గొప్పలు చెప్పుకోవటం కాదు. ఒక సినిమా చూసిన తర్వాత ఎవరైనా అది ఎందుకు బాగుందో/బాగోలేదో విశ్లేషించి చెప్పగలరు. కానీ సినిమా తియ్యటమే కష్టమైన పని.)

నేపథ్యం: ‘వై దిస్ కొలవెరి’ సృష్టించిన ప్రభంజనం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లోనే 20 కోట్ల వీక్షణలతో యూట్యూబ్లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ పాట. ఆ పాట సృష్టించిన ప్రభంజనంతో సినిమా సంగతి ఎలా ఉన్నా ఆ పాటని ఎలా చిత్రీకరించారో చూడాలనే కుతూహులంతో నేను మొదటి రోజు సినిమా చూడటం జరిగింది. పాటతో పాటు సినిమా కూడా నన్ను నిరాశపరిచింది. ఈ సినిమా దక్షిణాదిన విడుదలైన 2 నెలలకి హిందీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ తెలుగు, తమిళ్ భాషల్లో వచ్చిన నిరాశాజనకమైన ఫలితాలను చూసి హిందీలో విడుదల చెయ్యకూడదని నిర్ణయించుకున్నారు.

నాతో పాటు సినిమా చూడటానికి వచ్చిన స్నేహితుల్లో చాలా మందికి ప్రథమార్థం బాగా నచ్చి, ద్వితీయార్థం ‘అతి’గా అనిపించింది. నాకు మాత్రం ద్వితీయార్థం బాగా నచ్చి, ప్రథమార్థం విసుగనిపించింది. అలా జరగటానికి కారణం అస్థిర ప్రధాన రసానుభూతి (జానర్ షిఫ్ట్) అని తర్వాత తెలిసింది. ఒక సాదాసీదా రొమాంటిక్ కామెడీ ద్వితీయార్థంలో సైకలాజికల్ థ్రిల్లర్ గా మారుతుంది. ప్రథమార్థంలో ప్రేమ — హాస్యం ప్రధాన రసాలుగా ఉంటే, ద్వితీయార్థంలో దుఖం, ఆందోళన మరియు ఉద్రేకం ప్రధాన రసాలుగా మారుతాయి. ఈ అనూహ్య మార్పుకి ప్రథమార్థంలో కనీసం సబ్ — కాన్సియస్ లెవెల్లో సన్నద్ధం చేసే అంశాలు ఏ మాత్రం లేకపోవటం వల్ల ప్రేక్షకులకి జీర్ణించుకోవటం కష్టమయ్యింది.

ఈ సినిమాలోని బలమైన జానర్ షిఫ్టుకి కారణం ఎక్కువ శాతం కథ హీరో దృక్కోణంలో (పాయింట్ ఆఫ్ వ్యూ) సాగడమే. ప్రథమార్థంలో హీరోని హీరోయిన్ తిరిగి ప్రేమించేంత వరకు కథ హీరో దృక్కోణంలో సాగితే, ద్వితీయార్థంలో హీరో స్నేహితుడి దృక్కోణంలో ప్రారంభమైన కథ హీరోకి బైపోలార్ సైకలాజికల్ డిజార్డర్ అని తెలియగానే మళ్లీ హీరో దృక్కోణంలోకి వచ్చేస్తుంది. మనం కథని ఏ పాత్ర దృక్కోణంలో చూస్తే ఆ పాత్రలాగా అనుభూతి చెందుతాం. కాబట్టి, ప్రథమార్థంలో హీరోని హీరోయిన్ తిరిగి ప్రేమించేంత వరకు హీరో అనుభవించే ప్రేమని, హాస్యాన్ని; ఆ తర్వాత ఇంటర్వెల్ వరుకు ఇరువురి దృక్కోణాల నుండీ సాగే కథలోని ప్రేమని అనుభూతి చెందుతాం. ద్వితీయార్థంలో హీరో స్నేహితుడి దృక్కోణం చాలా తక్కువ సేపు ఉంటుంది. హీరోకి బైపోలార్ సైకలాజికల్ డిజార్డర్ అని తెలియగానే కథ మళ్ళీ అతడి దృక్కోణానికి మారి దుఖం, ఆందోళన, ఉద్రేకం లాంటి ప్రతికూల భావావేశాలని అనుభవిస్తాం.

అయితే ఇది రచయిత్రి తెలియక చేసిన పొరపాటుగా నేను భావించను. ‘ఒకమ్మాయిని ఎన్నో ఏళ్ల నుండీ ప్రాణంగా ప్రేమించి, పెళ్లాడి తనకున్న మానసిక సమస్య వల్ల ఆ అమ్మాయికి ఏ ముప్పు రాకూడదనే ఆలోచనతో ఆత్మహత్య చేసుకునే ఒక యువకుడి కథ’ — న్యాయంగా అతని దృక్కోణం నుండే సాగాలి. పైగా కథలోని పతాక సన్నివేశంలో హీరో ఆత్మహత్యకి దారి తీసిన పరిస్థితుల్ని ప్రేక్షకులు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ పాత్ర అనుభవించే భావోద్వేగాలని మనం కూడా అనుభవించాల్సిందే. ఈ కథా సారం కొంచెం అటు ఇటుగా ఆషికీ — 2 లా ఉంటుంది. కానీ ఆషికీ — 2 లో హీరో ఆత్మహత్యకి కారణమైన మద్యపానం గురించి సినిమా మొదటి నుండీ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ముందు చెప్పినట్టు ‘3’ లో అది కొరవడింది.

బహుశా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే (నరాళ కథనం) ఈ సినిమాకి సరిపోతుందని నా అభిప్రాయం. హీరో చనిపోవటం సినిమా మొదట్లోనే హుక్ సీన్ గా చూపించటం నాకు నచ్చలేదు. తమ అభిమాన స్టార్ హీరో సినిమాలో చనిపోవటాన్ని ఏ మాత్రం అంగీకరించిలేని ప్రేక్షకుల దగ్గర మాత్రమే ఈ టెక్నిక్ వాడాలని నా అభిప్రాయం. ధనుష్ మరణాన్ని కథ పరంగా ఎక్కడొచ్చినా ప్రేక్షకులు అంగీకరిస్తారని నా నమ్మకం. ఆయన చనిపోవటాన్ని ముందే చూపించకుండా సరళంగా, హాయిగా సాగుతున్న కథలో ఉన్నట్టుండి హఠాత్తుగా ప్రధాన పాత్ర చనిపోతే అతడు ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలనే ప్రేరణ ప్రేక్షకులకి ఇచ్చిన వాళ్లం అవుతాం. అదలా ఉంటే:

1. హీరో హీరోయిన్ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవటం కథలోని మొదటి భాగం,

2. హీరోకి బైపోలార్ సైకలాజికల్ డిజార్డర్ అని తెలిసిన దగ్గర నుండీ అతను ఆత్మహత్య చేసుకునేంత వరుకు రెండవ భాగం,

3. హీరోయిన్ తన భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకోవటానికి చేసే పరిశోధన, పై రెండు భాగాలకి మధ్య వారధి.

వీటిలో మొదటి రెండు భాగాల మధ్య పూర్తిగా కాకపోయినా, కనీసం కొంత భాగాన్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేగా అల్లితే కథలోని సమస్యని ముందుగానే లేవనెత్తటంతో పాటు, థీమ్ పరంగా ఇంకా లోతైన చర్చ జరిగుండేదని నా అభిప్రాయం. అయితే అదంత సులభం కాదు. ప్రేక్షకులకి అసలు కథే అర్థం కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సినిమాలు విడులయ్యినప్పుడు అపజయంపాలయ్యి (రాక్ స్టార్, వన్ — నేనొక్కడినేలాగా) తర్వాత ‘కల్ట్ క్లాసిక్’ స్టేటస్ ని మూట కట్టుకుంటాయి! :P

పి.ఎస్.: ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకి థియోటర్లలో సినిమా నిడివిని తగ్గించటానికి ‘కొలవెరి డి’ పాటని తొలగించారు!

Why ‘3’ failed?

(Disclaimer: I don’t intend to brag about my film knowledge by writing this critique on 3, neither do I believe that I know any better than the writer/director of this movie. It’s easy to scrutinize an already released movie but it’s hard to make one.)

A little back-story: Do you remember the mania of ‘Kolaveri Di’? It was the most viewed Indian song on YouTube with 20+ crore views back in the year 2010. With the hype the song generated, I was so curious to see how the song was visualized and shot irrespective of how the movie was gonna be and so I went to watch the movie on the first day morning show. Both the song and the movie were extremely disappointing. After 2 months from the southern release the filmmakers had planned to release the movie in Hindi but as they witnessed the disappointing results both in Tamil and Telugu, they had to shelve their plans.

My friends who accompanied me to the movie liked the first half but felt that the second half was out of place whereas I felt bored in the first half but liked the second half. Later I realized that it was due to something called ‘Genre shift’. What began as a simple rom-com turned into a complex psychological thriller in the second half of the movie. The primary emotions in the first half were romance and humor but in the second half the audiences were forced to experience totally contrast emotions such as suspense, horror and thrill. As there wasn’t enough set-up for this unexpected change in the first time it was hard for the audiences to digest it in the second half.

This abrupt genre-shift occurs as most of the story is told through the point of view of the hero (male lead). In the first half the story is narrated through the point of view of the hero until the heroine falls in Love with him whereas in the second half, the story starts from his friend’s point of view but quickly takes his point of view once he gets to know that he is suffering from Bipolar psychological disorder. Our experience of the story depends upon whose point of view is the story narrated. Therefore we experience the love and humor in the first half (as he experiences the same) and when the heroine accepts his love, we take both their point of views therefore we experience the Love that they experience. In the second half we feel a sense of suspense till the point of view shift occurs and then we get into the shoes of the hero therefore we experience misery and horror the way he does.

However I don’t think that the writer was unaware of this possible flaw. The story of ‘a guy who immensely loves a girl, marries her but kills himself as he doesn’t want to harm her due to a psychological problem that he suffers from’ should be told from his point of view for sure. In order to justify his radical decision of committing suicide the audiences should experience the minutest of his feelings that led to it. Isn’t it pretty close to Ashique 2? But unlike in Ashique 2 where they have enough set-up for the cause of his death (that is alcoholism) ‘3’ lacks any such preparation.

Perhaps a non-linear style screenplay could be a possible solution for this problem. To start with I personally didn’t like the opening sequence featuring Dhanush’s dead body. I thought it was inappropriate to show him dead in the very begging. There are some star actors whose death, even in a movie can’t get digested by their fans. By showing them dead in the very beginning one can avoid the disappointment for the fans in the end, then the movie would be about the circumstances that led to his death whereas in ‘3’ I don’t think Dhanush’s fans would raise an objection for his abrupt death in a movie. Assume a pleasant Love story leading to marriage and then the hero dies abruptly, the audiences (out of shock) would be motivated to find the reasons for his death.

The timeline of ‘3’ can be divided into 3 parts:

1. The hero and the heroine fall in Love with each other and get married,

2. From the point where the boy gets to know about his psychological condition till he commits suicide,

3. The heroine doing her research to find reasons for his death works like a bridge between the above mentioned timelines.

In case the first two above mentioned timelines are inter-cut even in a small portion of the first half, the core concept (bipolar) would have been established much earlier in the movie as well as creating an opportunity to explore the theme of the movie in a more profound manner.

P.S.: After the film’s release, in order to reduce the length of the movie the theatres had chopped off the ‘Kolaveri’ song!

--

--

Harish Parthu

I am a film enthusiast. Here I analyse, appreciate and critique (predominantly) Telugu movies in a nuanced fashion.