Ninne Pelladatha, Sagara Sangamam, Shiva,— Expressive Sound Design నిన్నే పెళ్ళాడతా, సాగర సంగమం, శివ — ఎక్ప్రెసివ్ సౌండ్ డిజైన్

Harish Parthu
6 min readNov 29, 2020

(నేను ఈ విశ్లేషణని ఇంగ్లీషులో చదవమని సూచిస్తాను. ఒకవేళ తప్పని పక్షంలో తెలుగు అనువాదం కిందనే ఉంది, చదవండి.)

Sound design in movies can be divided into two categories:
1. Neutral sound design,
2. Expressive sound design.

In neutral sound design the audiences would hear almost everything from the ambience. The intention of such sound design is to place the audiences in the environment whereas in the expressive sound design the audiences would hear only a few selected sounds from the scene that the sound designer wants them to focus on, when he doesn’t want the audiences to listen to anything else from the scene as it may deviate the audiences from the drama he intends to create.

Ninne Pelladatha (1996)

NINNE PELLADATHA

The pilot training scene in which the scared Tabu runs out of the helicopter, the sense of fear and nervousness is created by the expressive sound design. In reality when we are put in scary situations, we tend to hear selective sounds, the ones that are causing the fear. Those scary sounds would get amplified in our heads at that moment. So is the case with Tabu’s character in the scene. She is scared of helicopters. Therefore as she enters the field the constant flying helicopter sounds scare her.

As she gets inside the helicopter she hears every little detail in it that causes the fear. Some actions such as the seat belt being buckled and the headset being removed (at the end of the scene) make her feel that they are taking forever to be executed in that panic moment. She hears the sound of the seat belt being buckled thrice and then the headset being positioned on her head; followed by a short loop of suspense score. Then the sounds of the rotating helicopter’s fans start off with normal amplitude and then quickly ascend to an unbearable proportion. She feels overwhelmed by the sound so she runs out of the helicopter.

Sagara Sangamam (1983)

SAGARA SANGAMAM

In an iconic scene from Sagara Sangamam Kamal Hassan’s character explains SP Sailaja’s character what real dance is, in the press office. This scene is followed by another scene in which Sarath Babu’s character almost begs the press owner to take Kamal Hassan back into his job:

This scene takes place inside the press mill as the newspapers are getting printed by the huge printing machines running behind the characters. The scene lasts for just 20 seconds and we can’t hear their conversation as their vocals are dominated by the high amplitude sounds of the printing machines. The feeling and the information of the scene can only be understood by their facial expressions and body language. The sound designer could have made us hear their conversation as well despite being dominated by the noise of the machines but he chooses not to; to convey the feeling that Sarath Babu’s voice is not heard in such situation. The huge machines making loud noises conveys the feeling of suppression caused by their mechanical way of looking at things.

Shiva (1989)

SHIVA

Context: Shiva gets hold of Bhavani’s main goon Ganesh and hands him over to the police station. Bhavani decides to kill Ganesh as he feels that it’s risky for him if Ganesh enters the court premises for a judiciary trial. In the scene Bhavani deceives the police by making a wrong phone call. As a major portion of the police force leaves the police station, Bhavani’s goons enter into it, one of the goons attacks the police constable and then they enter inside the station room and prison the remaining police officer. As one of the goons aims a revolver at Ganesh in the prison he gets hit by Shiva from behind. This scene is supposed to make us feel that Ganesh will be certainly taken out of the prison until the end of the scene.

The scene starts with the police officer getting a phone call. We hear the rapidly ticking clock sound followed by the sound of the phone ringing. As we finish listening to their conversation we cut to Bhavani and then cut back to the police station. From this point we hear the brilliant score by Ilayaraja that conveys the feelings of both aggression and pathos till the point where the goon leader opens the prison gate of Ganesh. We first hear the sounds of door being locked as they lock the remaining police officer and then we hear the following sounds with reverb: The footsteps of the goons’ leader, the opening of the cell gate, a non-diegetic sound effect created by looping the sound of the rotating revolver’s cylinder, the revolver’s trigger being pulled and then the sound of the goons’ leader being hit on his head. All this is accompanied by the sound of rapidly ticking clock that we heard in the very beginning of the scene.

The sound designer could have made us hear any other sounds from the environment such as the crickets chirping, dogs barking, the wind, the traffic, the falling down of the police constable, the footsteps of the remaining police officer, his body movement’s sounds etc., But the reason the sound designer chose to use a few selective sounds (highlighting them with a reverb) is because he wants us to exclusively focus on the goons’ process of killing Ganesh so as to create expectations that will be broken by the end of the scene.

నిన్నే పెళ్ళాడతా, సాగర సంగమం, శివ — ఎక్ప్రెసివ్ సౌండ్ డిజైన్

సినిమాల్లో సౌండ్ డిజైన్ ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు:
1. న్యూట్రల్ (తటస్థ) సౌండ్ డిజైన్,
2. ఎక్స్ప్రెసివ్ (వ్యక్తీకరణ) సౌండ్ డిజైన్.

న్యూట్రల్ సౌండ్ డిజైన్లో ప్రేక్షకుడు సీన్ జరుగుతున్న పరిసరాల్లో వినిపించే దాదాపు ప్రతి శబ్దాన్ని వింటాడు. ఆ ప్రదేశంలో ప్రేక్షకుడు నిమగ్నమయ్యేలా చెయ్యటమే ఈ రకమైన సౌండ్ డిజైన్ యొక్క లక్ష్యం. ఎక్స్ప్రెసివ్ సౌండ్ డిజైన్లో మాత్రం ప్రేక్షకుడు సీన్లో చోటు చేసుకునే కొన్ని శబ్దాలను మాత్రమే వింటాడు. ఇలా ఎంపిక చేసుకున్న కొన్ని కీలక శబ్దాలను మాత్రమే ప్రేక్షకుడికి వినిపించటం ద్వారా, అతడి ధ్యాస పక్కదోవ పట్టకుండా ఆ సన్నివేశంలో ఉండే డ్రామా మీద మాత్రమే నిమగ్నమయ్యేలా చెయ్యవచ్చు.

నిన్నే పెళ్ళాడతా

నిన్నే పెళ్ళాడతా (1996)

నిన్నే పెళ్ళాడతాలో టబు పైలెట్ ట్రైనింగ్ సన్నివేశంలో భయపడి హెలికాప్టర్లో నుండీ బయటకి పారిపోతుంది. ఆ సీన్లో టబు అనుభవించే భయాన్ని, ఆందోళనని ఎడిటింగ్ మరియు సౌండ్ డిజైన్ల ద్వారా ప్రేక్షకులకు కలిగించారు. నిజ జీవితంలో మనం భయాందోళనలకు గురయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి భయాన్ని కలిగించే శబ్దాలు మాత్రమే మోతాదుకు మించి వినిపిస్తాయి. ఈ సీన్లో టబుకి కూడా అదే జరుగుతుంది. ఆమెకి విమానాలంటే భయం. అందుకే ఆ ప్రదేశంలోకి అడుగు పెట్టినప్పటి నుండీ ఎగిరే విమానాల మోత ఆమెని భయపెడుతుంది.

ఆమె విమానంలోకి ప్రవేశించినప్పటి నుండీ లోపల జరిగే ప్రతీ చిన్న విషయం ఆమెని భయపెడుతుంది. మిగతా సందర్భాలలో త్వరితగతిన జరిగే సీటు బెల్టు పెట్టుకోవటం, సీన్ చివరలో హెడ్ ఫోన్స్ తీసెయ్యటం లాంటి పనులు తన ఆందోళన వల్ల ఆమెకి ఎక్కువ సేపు జరుగుతున్న భావన కలుగుతుంది. సీటు బెల్టు పెట్టుకునే శబ్దం మూడు సార్లు, తర్వాత హెడ్ ఫోన్ పెట్టుకునే శబ్దం, ఆ తర్వాత ఆందోళనని కలిగించే ఒక లూప్ సౌండ్ ట్రాక్ వినిపిస్తాయి. ఆ తర్వాత విమానం యొక్క రెక్కలు తిరగటం మామూలు శబ్దంగా మొదలయ్యి, త్వరితగతిన చాలా పెద్ద శబ్దంగా మారుతుంది. ఆ శబ్దాన్ని భరించలేక టబు విమానంలో నుండీ బయటకి పారిపోతుంది.

సాగర సంగమం (1983)

సాగర సంగమం

ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రెస్ కార్యాలయంలో ఎస్పీ శైలజకి అన్ని రకాల శాస్త్రీయ నృత్యాల గురించి వివరించే సన్నివేశం ఉంటుంది కదా.. దాని ఫలతంగా కమల్ హాసన్ ఉద్యోగంలో నుండీ తొలగించబడతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశంలో శరత్ బాబు ఆ ప్రెస్ మీడియా యజమాని దగ్గరకి వెళ్లి కమల్ హాసన్ని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోమని ప్రాధేయ పడతాడు.

ఈ సన్నివేశం ఒక ప్రెస్ మిల్లులో భారీ ముద్రణ యంత్రాలు వార్తా పత్రికలను ముద్రిస్తుండగా వాటి ముందు చోటు చేసుకుంటుంది. ఇరవై సెకండ్ల పాటు సాగే ఈ సన్నివేశంలో ముద్రణ యంత్రాల భారీ శబ్దాల కారణంగా మనకు పాత్రల సంభాషణలు వినిపించవు. కేవలం పాత్రధారుల బాడీ లాంగ్వేజ్ మరియు ముఖకవళికల ద్వారా వాళ్ల భావం, సన్నివేశంలో చోటుచేసుకునే సమాచారం అర్థమవుతుంది. ముద్రణ యంత్రాల భారీ శబ్దాలతో పాటుగా వాళ్లు మాట్లాడుకునే మాటలు కూడా మనకు వినిపించవచ్చు. అలా చెయ్యకుండా ఉండటానికి కారణం శరత్ బాబు ఆవేదనని (గొంతుని) అవతల వ్యక్తి వినిపించుకోవట్లేదు అని సూచించటం. వేగంగా తిరిగే మరలు ఆ ప్రెస్ మిల్లు యొక్క యాంత్రిక స్వభావం, ఫలితంగా కలిగే అణచివేత అనే భావాన్ని సూచిస్తాయి.

శివ (1989)

శివ

సందర్భం: భవాని దగ్గర పనిచేసే ప్రధాన రౌడీ గణేష్ ని శివ పట్టుకొని పోలీసులకు అప్పజెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న భవాని, కోర్టులో గణేష్ నోరు విప్పితే తనకి ప్రమాదమని తలచి గణేష్ని పోలీస్ స్టేషన్లో వుండగానే చంపించాలని చూస్తాడు. ఈ సీన్లో మొదటగా భవాని ఒక దొంగ ఫోన్ కాల్ చేసి పోలీసులను పక్కదోవ పట్టించి, వారు స్టేషన్ వదలి బయటకు పోయేలా చేస్తాడు. ఆ తర్వాత భవాని మనుషులు పోలీస్ స్టేషన్ని సమీపించి, లోనికి ప్రవేశించి, అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్ని కొట్టి, స్పృహ కోల్పోయేలా చేసి; స్టేషన్ గదిలోకి ప్రవేశించి, అక్కడున్న ఇంకొక పోలీస్ ఆఫీసర్ని గదిలో బందించిన తర్వాత గణేష్ ఉన్న లాకప్ గదిలోకి ఆ రౌడీల గుంపు నాయకుడు ప్రవేశించి తన దగ్గరున్న రివాల్వర్తో అతన్ని కాల్చి చంపబోగా వెనుక నుండీ శివ అతని తల పై బలంగా కొట్టి, స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఖచ్చితంగా భవాని మనుషులు గణేష్ ని తీసుకెళ్ళి పోతారు అనే భావనని కలిగించి, చివరలో ట్విస్ట్ ఇవ్వటం ఈ సీన్ యొక్క ధ్యేయం.

ఈ సీన్ స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ కాల్ రావటంతో మొదలవుతుంది. ఆ సమయంలో మనం వేగంగా కదులుతున్న గడియారం ముల్లు శబ్దం, మోగుతున్న ఫోన్ శబ్దం, తర్వాత వాళ్లు ఫోన్లో మాట్లాడుకునే శబ్దం వినిపిస్తుంది. ఆ సంభాషణ పూర్తవగానే భవాని ఉన్న చోటుకి కట్ చేసి, మళ్లీ పోలీస్ స్టేషన్ ఉన్న సీన్లోకి వస్తాం. భవాని కనిపించిన దగ్గర నుండీ ఇళయరాజా గారి ఉద్రేకం మరియు బాధ కలిగించే సంగీతం మొదలయ్యి, ఆ రౌడీ గుంపు నాయకుడు గణేష్ ఉన్న లాకప్ రూం తెరిచేంత వరుకు కొనసాగుతుంది. స్టేషన్లో మిగిలిన పోలీస్ ఆఫిసర్ని వేరే గదిలో బంధించినప్పుడు ఆ గది తలుపు మూసుకున్న శబ్ధం వినపడుతుంది. దాని తర్వాత వరుసగా ఈ శబ్దాలు రీవెర్బ్ తో వినిపిస్తాయి: రౌడీ నాయకుడి అడుగుల శబ్దం, గణేష్ ఉన్న లాకప్ గది గేటు తెరుచుకోవడం, రివాల్వర్ సిలెండర్ తిరుగుతున్న శబ్దాన్ని లూప్ చెయ్యగా వచ్చిన నాన్ — డైజేటిక్ శబ్దం, రివాల్వర్ మీట లాగగా వచ్చిన శబ్దం, చివరగా శివ అతడి తల పై బలంగా కొట్టగా వచ్చిన శబ్దం. ఈ శబ్దాలతో పాటు సమాంతరంగా మనం సీన్లో ముందుగా విన్న వేగంగా తిరిగే గడియారం ముళ్లు శబ్దం కూడా వినిపిస్తుంది.

స్టేషన్ ఆవరణలో వినిపించే కీచురాళ్ళ శబ్దం, కుక్కల అరుపులు, ట్రాఫిక్, గాలి, కింద పడ్డ కానిస్టేబుల్ శబ్దం, బంధింపబడ్డ పోలీస్ ఆఫీసర్ అడుగుల శబ్దం, అతడి శరీర కదలికల శబ్దం ఇలా ఎన్ని శబ్దాలనైనా సౌండ్ డిజైనర్ ఈ సన్నివేశంలో పొందుపరచి ఉండొచ్చు. కానీ అలా చెయ్యకుండా సీన్లోని కొన్ని ముఖ్యమైన శబ్దాలను మాత్రమే, రీవర్బ్ తో హైలైట్ చేసి వినిపించటం ద్వారా భవాని మనుషులు గణేష్ ని ఖచ్చితంగా చంపేస్తారు అనే అంచనాల్ని కలిగించి, సీన్ చివర్లో ఒక ట్విస్ట్ ద్వారా ఆ అంచనాల్ని తలకిందులు చెయ్యటంలో సహకరిస్తాడు.

--

--

Harish Parthu

I am a film enthusiast. Here I analyse, appreciate and critique (predominantly) Telugu movies in a nuanced fashion.