నిన్నే పెళ్లాడతా (1996) — నాటకీయత

Harish Parthu
4 min readNov 15, 2020

Ninne Pelladatha (1996) — Sense of Drama

(The English translation of this article is attached below.)

2 గంటల 24 నిమిషాల సినిమా. అందులో గంటా 53 నిమిషాల వరకు, అంటే చివరి అర్థగంట వరకు కథలో పెద్దగా సంఘర్షణే (కాన్ఫ్లిక్ట్) ఉండదు. ప్రధాన సంఘర్షణా మూలాన్ని కథకుడు ఆదిలోనే లేవనెత్తినా దానిని ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు. హీరోయిన్ వాళ్ల కుటుంబ సభ్యులకు విషయం తెలిసినప్పుడు చూసుకుందాం లే అనుకుంటాడు. హిచ్కాక్ టైం బాంబ్ సూత్రాన్ని ఆయుధంగా వాడుకొని ప్రేక్షకుల్ని తెగ ఆందోళనకి గురి చెయ్యాలనే దృక్పథం కూడా కథకుడిలో కనిపించదు. చివర్లో వచ్చే సంఘర్షణకి ప్రేక్షకుల్ని సన్నద్ధం చేసే సెటప్ మాత్రమే ఉంటుంది. చివర్లో సంఘర్షణ చోటు చేసుకునేంత వరకు హీరో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలని, వాళ్ల మధ్య ఉద్భవించే హాస్యాన్ని, సంగీతాన్ని హాయిగా ఆస్వాదించటమే!

కథలోని పాత్రల మధ్య ప్రధాన సంఘర్షణ మీదనే కథనాన్ని నడపనవసరం లేదు. భావోద్వేగం ఏదైనా సూక్ష్మస్థాయిలో ప్రతీ సన్నివేశంలో (లేదా సీక్వెన్స్లో) ఉండే అంతర్గత సంఘర్షణ నాటకీయతకు దోహదపడుతుంది. ఉదాహరణకి చంద్రమోహన్ ఉత్తేజ్కి కారు పెయింట్ ఊడకుండా తుడవమనే విషయం నోటితో చెప్పలేకపోవటం నాటకీయతకు తోడ్పడుతుంది. నాగార్జున, టబుల ప్రేమ విషయం ఇంట్లో అందరికీ తెలిసినా తెలియనట్టు నటించటం నాటకీయతకు దారి తీస్తుంది. ఇలా ప్రతీ సన్నివేశంలో నాటకీయత ఉన్నపటికీ, అది ప్రధాన సంఘర్షణకి నేరుగా అనుసంధానమయ్యి ఉండదు.

అయితే ఇదేదో కథకుడు తన తెగువని చూపించుకోవటానికి చేసిన ప్రయత్నంలా కనిపించదు. ఒక రకంగా చూస్తే ఈ సినిమాలోని గంటా 53 నిమిషాల పాటు సాగిన కథని సెటప్ గా భావించొచ్చు. ప్రతి మంచి కథలో ఒక బలమైన ప్రధాన నాటకీయాంశం ఉంటుంది. ఉదాహరణకి కృష్ణవంశీగారి సినిమాలనే తీసుకుంటే, చేప పిల్లల్ని నీళ్ళ తొట్టెలో వేసి బందించటాన్ని చూసి తట్టుకోలేని ఒక సున్నిత మనస్కురాలు అత్యంత క్రూరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో చిక్కుకోవటం (గులాబి), ఏదైనా చట్టబద్దంగా, ప్రజాస్వామికంగా జరగాలని బలంగా నమ్మే ఒక పోలీస్ ట్రైనీ తుపాకీ చేతపట్టి నక్సలైట్ నాయకుడిగా మారటం (సిందూరం), వంశపాంపర్యంగా వెంటాడుతున్న ఒక శాపం కుటుంబంలో అత్యంత చిన్నవాడి, ప్రియమైనవాడి ప్రాణాన్ని కోరుకోవటం (మురారి) మొదలైనవి.

మహాలక్ష్మిని (టబు) అక్కరకు చేర్చుకొని, అత్యంత ప్రేమని కురిపించిన కుటుంబమే ఉన్నట్టుండి ఆమెని మూర్ఖంగా ససేమిరా వద్దనటం నిన్నే పెళ్ళాడతాలోని ప్రధాన నాటకీయాంశం. అది బలంగా పండాలంటే ఆ కుటుంబంలోని మనుషులు ఎంత మంచివాల్లో, ఎంత ఓపెన్ మైండెడో, కొడుకుని ఎంతగా ప్రేమిస్తారో, కాబోయే కోడలిని ఎంత అక్కరకు చేర్చుకుంటారో ప్రేక్షకుడు స్వయానా చూసి, అనుభవించాలి. ఆ ఆహ్లాదకరమైన వాతవరణానికి ప్రేక్షకుడు పూర్తిగా అలవాటు పడిపోయాక పాత్రల మధ్య చోటు చేసుకునే అపార్థాలు, వారిలోని అహంకారం, మూర్ఖత్వం, హింసలాంటి విరుద్ధమైన పార్శ్వాలను లోతుగా స్పృశించినప్పుడు కథలోని నాటకీయత ఉచ్చ స్థాయికి చేరుకుంటుంది. ఈ సినిమా వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏం జరిగబోతుందో ఊహించటం అంత సులభం కాదు. అలా కాకుండా అప్పటి ప్రేమకథల సాంప్రదాయం ప్రకారం ప్రథమ భాగంలో అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడటం, ఇంటర్వల్ సమయానికి తల్లిదండ్రుల మూలంగా వారు విడిపోవటం జరిగితే నిన్నే పెళ్లాడతా ఒక మంద స్థాయి చిత్రంగా మిగిలిపోయేది!

Ninne Pelladatha (1996) — Sense of Drama

Ninne pelladatha is a 2 hour 24 minutes movie. In it, there isn’t any major conflict till the last half an hour. Even though the writer raises the major conflict of the story in the very beginning it doesn’t stay with audiences for so long. Neither does the writer intend to induce a great sense of suspense using the Hitchcock’s bomb theory. All it has is a recurring set-up for the pre-climax conflict. Till that point the audiences are given the great privilege of enjoying the family relationships and the resulting humor and music.

A storyteller doesn’t necessarily have to run the whole story on the major conflict between the characters. Irrespective of the intended emotion the macro level internal conflict of each scene leads to drama. For example, Chandra Mohan not being able to verbally communicate with Uttej to clean the car without damaging the paint leads to drama. The family members, despite knowing about the Love affair between Nagarjuna and Tabu, pretending to be naive in front of him leads to drama. However the internal drama of each scene in Ninne Pelladatha is not directly associated to the final major conflict.

However it doesn’t appear as though the writer is trying to be flamboyant about his experimental nature here. To fit it all into a perspective, it seems as though the first one hour and 53 minutes is just a set-up for the final conflict. Every good story has a core dramatic point. Take Krishna Vamsi’s stories for example, ‘a sensitive girl who can’t even tolerate the sight of fishes being captured in an aquarium is later trapped in the most violent trap of human trafficking’ is Gulabi. ‘An idealistic Police trainee who is a firm believer of democracy and law and order is forced to take up the gun to become a Naxalite leader’ is Sindooram. ‘An inevitable curse that haunts a clan every once in 48 years now seeks the life of the most loved and the youngest of the family’ is Murari.

‘A family that shows utmost Love and warmth to a girl suddenly rejects her idiotically’ is the core dramatic point of Ninne Pelladatha. For that to click, we the audiences need to not only witness but also experience their generosity, open mindedness, love for their son and warmth for his would-be wife. As the audience is completely used to the pleasantness of it, if he gets to see the misunderstandings, stupidity, egoism and violence among the same characters the sense of drama touches the peek as well as different character grays are examined from the other dimension. As Ninne Pelladatha is a realistic film, it isn’t so easy to predict the future events. In case the same Love story is structured in a traditional way of boy, girl falling in love and by the intermission they get separated due to the differences between their parents it would have been a below average film!

--

--

Harish Parthu

I am a film enthusiast. Here I analyse, appreciate and critique (predominantly) Telugu movies in a nuanced fashion.