మాయాబజార్ సినీ విశ్లేషణ పార్ట్ - 1, రచన.
Decoding Mayabazar Part - 1, writing.

Harish Parthu
10 min readNov 15, 2020

కథ: ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ (2009) నేను చూసిన మొట్టమొదటి ప్రత్యామ్నాయ చరిత్ర (alternative history) కలిగిన చిత్రం. చరిత్రలో మనకి ఏ మాత్రం నచ్చని విషయాల్ని మనకి నచ్చిన విధంగా మార్చటానికి ఒక కల్పిత కథని సృష్టించి, ప్రేక్షకుల్ని రంజింపచెయ్యటమే ప్రత్యామ్నాయ చరిత్ర చిత్రాల ధ్యేయం. హిట్లర్ని సినిమా థియేటర్లో బంధించి కాల్చి చంపటం; కౌరవుల కుతంత్రాలను అందరి ముందూ బట్టబయలు చేసి, వాళ్లని నవ్వులపాలు చేసి, పాండవులు వనవాసం ముగించెలోపే వాళ్లని దండించటం.. ఆయా చరిత్రలు తెలిసిన సగటు ప్రేక్షకుడికి భలే కిక్కిచ్చే అంశాలు. అవి మన అహాన్ని సంతృప్తి పరుస్తాయి. మాయాబజార్ కథా లక్ష్యం కూడా అదే. వ్యాస భారతం ప్రాకారం బలరాముడుకి శశిరేఖ అని పిలువబడే కూతురు లేదు. మాయాబజార్ నిజానికి 'శశిరేఖా పరిణయం' అనే పేరుతో ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిన ఒక కల్పిత జానపద కథ. దాని ఆధారంగా కే.వి.రెడ్డి గారి మాయాబజార్ కి ముందు, తరువాత అనేక చిత్రాలు రూపొందినా ఆయన రూపొందించిన ఈ ఒక్క చిత్రం మాత్రమే అమిత ప్రజాదరణకు నోచుకుంది.

ఇకపోతే ఈ చిత్రానికి తొలుత 'శశిరేఖా పరిణయం' అని పేరు పెట్టారు. ఆ తర్వాత దానిని 'మాయాబజార్ అను శశిరేఖా పరిణయం'గా మార్చారు. చివరికి చిత్రం విడుదలయ్యే సమయానికి అది 'మాయాబజార్'గా మిగిలింది. 'శశిరేఖా పరిణయం' అనే పేరు కథా లక్ష్యాన్ని సూచించేలా ఉంటే, 'మాయాబజార్' అనేది చిత్రంలోని అద్భుత రసాన్ని (fantasy) ప్రతిబింబించేలా ఉంటుంది. పైగా మాయాబజార్ కథకున్న లక్ష్యం కేవలం శశిరేఖకు, అభిమన్యుడికి పెళ్లి చెయ్యటం కాదు. బహిరంగ కారణాల వల్ల వంచించబడ్డ శశిరేఖ తల్లిదండ్రుల (బలరాముడు, రేవతి దేవి) మనసు మార్చటం, కౌరవులను నవ్వులపాలు చేసి, వాళ్లని దందించబడటం ఈ కథలోని అంతిమ లక్ష్యం. కృష్ణుడు బలరాముడికి హితబోధ చేసినా, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో యుద్ధానికి దిగినా శశిరేఖా పరిణయం సాధ్యమయ్యేది కానీ కథకున్న అంతిమ లక్ష్యం సాధ్యపడేది కాదు.

పాత్రలు: ఈ కథలో ప్రధాన ప్రతినాయకుడు శకుని. చరిత్రలో మనకి నచ్చని పాత్రల్ని బలహీనులుగా, వెఱ్ఱి వెంగలప్పలుగా చిత్రించటంలో ఒక ఆనందం ఉంటుంది. అది ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్లో హిట్లర్ అయినా, ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్లో హిప్పీలు, బ్రూస్లీ అయినా, మాయాబజార్లో కౌరవులైనా. ఈ కథలో దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడి కుమారుడు అయిన లక్ష్మణ కుమారుడు పరమ వెఱ్ఱి వెంగలపల్లా కనపడుతూ, నిరంతరం శకునుడి దుష్ట ఆలోచనల అదుపులో ఉన్నట్టు కనిపిస్తారు. అలా కాకుండా వాళ్లని తెలివితేటలు కలిగిన దుష్టుల్లా చిత్రీకరించి ఉంటే, ఘటోత్కచుడు వాళ్లని మభ్యపెట్టడం సాధ్యమయ్యేది కాదు.

మరోవైపు బలరాముడి పాత్ర మంచివాడిలా మొదలయ్యి, ముఖస్తుతికి లోబడి ప్రతికూల పాత్రలా మారుతుంది. అతనిలోని ఈ అవాంఛిత మార్పుకి కారణం మనకి తెలుసు కావున ఆయన్ని మనం ద్వేషించం. రేవతీ దేవి స్థూలంగా డబ్బు వల్లే మనుషులు ఆనందంగా ఉంటారని నమ్ముతుంది. తన కూతురు సంతోషంగా ఉండాలంటే డబ్బున్నవాడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఈ తప్పుడు నమ్మకాన్ని ఆమె అధిగమించటం కూడా ఒక కథా లక్ష్యం.

ఘటోత్కచుడు నరమాంసం తినే రాక్షసుడు అయినప్పటికీ అతడి వేషధారణ రాక్షసుడిలా కాకుండా మనిషిలా ఉండటం, ఆయన హస్యప్రియుడు, భోజనప్రియుడు అయ్యుండటం, అతను తన సేవకుల పై ఎప్పుడూ కోపం తెచ్చుకోకుండా వాళ్లని ఉత్సాహపరిచటం, అతడు అతిథుల్ని గౌరవించే విధానం, ఎల్లప్పుడూ నవ్వుతూ ఆహ్లాదకరంగా ఉండటం, అతనిలోని అధ్బుతమైన మాయా విద్యలు ఉండటం, ఆ విద్యల్ని మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శశిరేఖా అభిమన్యుల పెళ్లిని జరపటానికి ఉపయోగించటం మొదలైన అనుకూల కారణాల వల్ల అతన్ని మనం ఎంతగానో ఇష్టపడతాం.

ఇకపోతే శ్రీకృష్ణుడు ఈ కథలో దేవుడు. అతడు మనుషుల దగ్గరే అంటీ అంటనట్టుగా ఉంటూ, వాళ్లలోని అన్ని రకాల అంతర్గత దారిద్ర్యాలనూ గమనిస్తూ, వాటిని సవరించే పరిస్థితుల్ని సృష్టిస్తూ, ఆ పరిస్థితుల వల్ల ఆ మనుషులకు కలిగే అనుభవాల రీత్యా వాళ్లకి కావాల్సిన జీవిత పాఠాలు నేర్చుకునేలా చేస్తుంటాడు.

స్క్రీన్ప్లే (కథనం): మాయాబజార్ కథ చాలా చిన్నది. కథనంతో దానిని బలపరిచారు. ఈ చిత్ర కథనం నాకు తారే జమీన్ పర్ కథనంలా అనిపిస్తుంది. ఆహ్లాదకరంగా మొదలైన కథ మెల్లగా విషాదకరంగా మారి, నిస్సహాయ స్థితిలో పాత్రలు కూరుకుపోయిన తర్వాత తారే జమీన్ పర్ లో ఆమిర్ ఖాన్, మాయాబజార్లో ఘటోత్కచుడు ప్రత్యక్షమవుతారు. ద్వితీయార్ధంలో కష్టాలన్నిటినీ ఒక్కొక్కటిగా తీరుస్తారు.

కథ అద్భుత రస ప్రధానమైనది అయినప్పటికీ కథనంలో ప్రథమార్థం కేవలం నాటకీయతను మాత్రమే కలిగి ఉంటుంది. ఆ నాటకీయ పరిణామాలు ఇప్పటికీ సమకాలీన పరిస్థితుల్లానే అనిపిస్తాయి. అమ్మాయి - అబ్బాయి ప్రేమలో పడటం, ఆ ప్రేమకి తల్లిదండ్రులు అడ్డు చెప్పటం, తల్లి కూతుర్ని చెంప మీద కొట్టడం, ధన నష్టం కలగగానే మొఖం చాటేసే చుట్టాలు, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేని కూతురు మొదలైనవి ఏ యుగంలో అయినా ప్రతీ ఇంట్లో ఉండేవే. ప్రేక్షకుడిని ఈ వాస్తవిక పరిస్థితులు ముందుగా కదిలిస్తాయి. వాస్తవిక లోకంలో ఏమీ చెయ్యలేని నిస్సహాయతని అంతమొందించే బాధ్యత ద్వితీయార్థంలోని అధ్భుత రసం తీసుకుంటుంది. అలా కాని పక్షంలో మాయాబజార్ ఇప్పుడొస్తున్న భారీ VFX చిత్రాల్లాగే కేవలం ఒక గిమ్మిక్ సినిమాగా మిగిలిపోయేది. ద్వితీయార్థంలో సంభవించే అద్భుతాలకు ప్రథమార్థంలో ప్రియదర్శిని సన్నివేశంలో సెటప్ ఉంటుంది. ద్వితయార్ధంలో వచ్చే ప్రధానరస మార్పు (జానర్ షిఫ్ట్), కథలోని పరిస్థితులు ఎలా అయినా చక్కబడాలి అనే ప్రేక్షకుల ఆకాంక్షకు అనుగణంగా ఉంటుంది కావున ఇబ్బందికరంగా అనిపించదు.

ఈ కథలో అనేక ఉపకథలు ఉంటాయి. ద్వారకలోని శశిరేఖ చుట్టూ జరిగే కథ ప్రధానమైనది కాగా, కౌరవుల దృక్కోణంలో సాగే కథ ఒకవైపు, ఘటోత్కచుని దృక్కోణంలో సాగే కథ మరోవైపు ఉంటుంది. ఏ ఉపకథనీ ఒకే సారి ఎక్కువ సేపు కొనసాగించకుండా ఆసక్తి కలిగించే విధంగా వాటి మధ్యలో ఇంటర్ కట్ చేస్తుంటారు. ఉదాహరణకు ఘటోత్కచుడు అభిమన్యుడ్ని ఇంటికి ఆహ్వానించగానే కౌరవులు ఉన్న చోటుకి కట్ చేస్తారు. ఒక సన్నివేశం నుండీ ఇంకో సన్నివేశానికి మారే క్రమంలో cause and effectతో (కారణం - ప్రభావం) పాటుగా, irony (యాదృచ్ఛికం) సూత్రాల్ని అనుసరిస్తారు. ఉదాహరణకి ప్రియదర్శినిలో దుర్యోధనుడు, శకుని కనపడగానే కౌరవ పాత్రల పరిచయ సన్నివేశం రావటం, శ్రీ కృష్ణుడు కౌరవుల అకృత్యాల గురించి వివరించగానే శకుని, కౌరవులు జాగ్రత్త పడే సన్నివేశం రావటం cause and effect సూత్రాన్ని అనుసరిస్తే; రేవతీ దేవి శశిరేఖని అభిమన్యుడి గురించి మందలించే సన్నివేశం కాగానే అభిమన్యుడు శశిరేఖని నౌకా విహారానికి తీసుకెళ్లే సన్నివేశం రావటం, బలరాముడు కౌరవులకు శశిరేఖనిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చిన వెంటనే పేద సుభద్రా దేవి అభిమన్యుడితో కలిసి ద్వారకకి రావటం వంటివి irony ని అనుసరిస్తాయి.

ఒక సన్నివేశంలో శశిరేఖ అసహనంతో 'చెంపా' అని పిలువబడే తన చెలికత్తె చెంప చెళ్లుమనిపిస్తుంది. ఈ చెంపా అనే పాత్రను మనం అంతకు ముందు శ్రీ కృష్ణుడు తమ ఇంటికి వచ్చాడనే విషయాన్ని శశిరేఖతో చాలా నీరసంగా చెప్తూ కనిపిస్తుంది. ఇంకో సారి రేవతీ దేవి సుభద్రని అవమానించే పనిలో సహకరిస్తూ కనిపిస్తుంది. కాబట్టి ప్రేక్షకుడికి అప్పటికే ఆమె మీద ఒక నిగూఢ ద్వేషభావం ఏర్పడి ఉంటుంది కావున శశిరేఖ ఆమెని కొట్టడం తప్పనిపించదు. మనం ఒక సినిమాలో దేనిని ఎక్కువ సార్లు చూస్తే అది మన మనసులో బలంగా నాటుకుంటుంది. లక్ష్మణ కుమారుడి పాత్రని మాటిమాటికీ ఏదో ఒక సన్నివేశంలో చూపించటానికి కారణం ఏంటంటే, ఆ పాత్రని మనకి ఎంత ఎక్కువ సేపు చూపిస్తే అంత ఎక్కువగా మనం శశిరేఖకి వాడు సరైన జోడీ కాదనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి, శశిరేఖకి పెళ్లి జరగకూడదని కోరుకుంటాం. సినిమా మొత్తంలో శశిరేఖకి అభిమన్యుడి మీదున్న ప్రేమని అధికంగా చూపించటానికి కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ కలవాలి అనే కోరికను ప్రేక్షకుడిలో బలంగా కలిగించటం. అందుకే ద్వితీయార్థంలో ఘటోత్కచుడు ద్వారకలోకి ప్రవేశించే వరుకు ఆ ఇద్దరి ఎడబాటునీ ఏదో ఒక రకంగా చూపిస్తూనే ఉంటారు.

ఇప్పుడందరూ అనుసరిస్తున్న 3 ఆక్ట్ స్ట్రక్చర్ కి, మాయాబజార్ స్క్రీన్ప్లేకి ఒక ప్రధాన బేధముంది. 3 ఆక్ట్ స్ట్రక్చర్లో మొదట ప్రధాన పాత్రకి ఒక లక్ష్యాన్నిచ్చి, తర్వాత ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా నడపిస్తూ ఇంటర్వల్ సమయానికి ఒక భారీ మలుపు ద్వారా ఆ లక్ష్యానికి దూరం చేసి మళ్లీ కోలుకునేలా చేసి, ఒడిదుడుకుల మధ్య ఆ పాత్ర లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. మాయాబజార్ స్ట్రక్చర్ అందుకు భిన్నంగా ఉంటుంది. ప్రదమార్థమంతా లక్ష్యానికి పూర్తిగా దూరం చేసి, ఇక ఏ రకమైన ఆశ మిగలని స్థితికి తీసుకెళ్ళి, ఘటోత్కచుడు ప్రవేశించడంతో వడివడిగా లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. పూర్తి విషాదం తర్వాత వచ్చే ఆనందానికి విలువెక్కువ ఉంటుంది. కౌరవుల్ని ఏమీ చెయ్యలేం అనుకునే మానసిక స్థితికి ప్రేక్షకుడ్ని తీసుకొచ్చి, తర్వాత వాళ్లని వెర్రివాళ్లని చేసి ఆడుకోవటం వల్ల మామూలుగా వచ్చేదాని కంటే ఆనందం రెట్టించి వస్తుంది. అందుకే మాయాబజార్ స్ట్రక్చర్ ఆ కథని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ప్రథమార్థంలోని సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) మొదలయ్యేంత వరుకూ వచ్చే ఆనందదాయక సన్నివేశాల్లో ఏ రకమైన అంతర్గత సంఘర్షణ ఉండదు, తర్వాత వచ్చే నాటకీయ విషాదకర సన్నివేశాల్లో చాలా అంతర్గత సంఘర్షణ ఉంటుంది, ఘటోత్కచుడు ద్వారకలో ప్రవేశించినప్పటి నుండీ వచ్చే సన్నివేశాలన్నీ ఆనందదాయకమైనవే కాబట్టి మరలా వాటిలో అంతర్గత సంఘర్షణ ఉండదు.

డైలాగులు:
"ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి!?"
"రసపట్టులో తర్కం తగదు."
"ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉందిగా!"

- ఈ మూడు నాకు మాయాబజార్లో అత్యంత నచ్చిన డైలాగులు. రచయిత తలుచుకుంటే ఆ కాలానికి తగ్గట్టు చాలా మెలోడ్రామాతో కూడిన డైలాగులు రాసి ఉండొచ్చు. కానీ మాయాబజార్ కథ ద్వాపర యుగంలో జరుగుతున్నప్పటికీ, వీలైనంత సమకాలీన భాషలో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా డైలాగుల గురించి ప్రముఖ పాటల రచయిత, అనువాద చిత్రాల మాటల రచయిత అయిన వెన్నలకంటిగారి మాటల్లో మీరే వినండి. ఈ క్రింది లింకును ఓపెన్ చేసి 22 నిమిషాల 24 సెకండ్ల వద్దకు వెళ్లండి:

పి.ఎస్.: వాణిజ్య చిత్రాలు రస ప్రధానంగా ఉండటం వల్ల కొన్ని సార్లు కథకు పెద్దగా సంబంధం లేని సన్నివేశాలు వచ్చి పడుతుంటాయి. ఉదాహరణకు మాయాబజార్లో 'గింబలి, గిల్పం' ఘట్టం యావత్తూ కథకి పెద్దగా సంబంధం లేని విషయం. కానీ మనం దానిని ఆస్వాదిస్తాం.

(తరువాయి భాగంలో మాయాబజార్లోని సాంకేతిక అంశాల గురించి తెలుసుకుందాం.)

Decoding Mayabazar Part — 1, writing.

Story: Inglorious Bastards (2009) was the first alternative history movie that I watched. Alternative history movies aim to inject dopamine into the audiences by creating a fictional story around the historical events in order to alter the things that we absolutely hate. Whether it's the killing of Adolph Hitler in a movie theater (or) exposing the Kauravas' conspiracy in front of everyone, insult/mock and punish them.. these things fill the audiences with immense joy as they are aware of the actual historical horrors. These alternative histories would satisfy our alter-egos. Mayabazar targets the same feeling. In fact there was no mention about Balarama's daughter Sasi Rekha in Vyasa Mahabharata. 'Sasi Rekha Parinayam' was a popular folklore story in the then state of Andrapradesh. Several movies were made based on this story before and after K.V. Reddy's version of Mayabazar but none of them succeeded with the audiences as it did.

K.V. Reddy's Mayabazar was initially titled as Sasirekha Parinayam. Later it was called 'Mayabazar anabadu Sasirekha Parinayam'. By the time the movie released it remained to be called 'Mayabazar'. The title Sasirekha Parinayam' indicates the goal of the story whereas Mayabazar indicates the genre of the movie. Anyway the goal of the story is not just to get Sasirekha and Abhimanyudu married but to change the minds of Sasirekha's parents (Balarama, Revathi Devi) as well as to defeat, mock and punish Kauravas. In case Sri Krishna lectures Balarama about what's good for his daughter (or) Abhimanyudu wagging a war against Lakshmana Kumara it would have been only possible to get Sasirekha married to Abhimanyudu but it wouldn't have been possible to change Sasirekha's parents.

Characters: Sakhuni is the primary antagonist in this story. It's a real pleasure to turn the historical characters (that we hate) into buffoons on screen whether it's Hitler from Inglorious Bastards (or) Hippies and Bruce Lee from Once upon a time in Hollywood (or) the Kauravas from Mayabazar. In Mayabazar Duryodhana, Karna, Dhussaasana and Duryodhana's son Lakshmana Kumara look like idiots who are under the psychic influence of the evil Sakhuni. In case they were shown exhibiting any intelligence, it wouldn't have been so easy for Ghatothkacha to fool them in the second half.

On the other hand Balarama starts off as a positive character but soon turns into a negative one as Kauravas laud him. Since the audiences are quite aware of the cause of this unwanted change, they don't necessarily hate him. Revathi Devi believes on a philosophical level that the wealth is all that's needed for human happiness and so she wants her daughter to get married to a rich guy.

Ghatothchaka is in reality a cannibal monster. But we still get so fascinated by him because he looks more like a human, as he is a foody and loves humor, as he never gets annoyed by his stupid servants instead encourage them to do new things and due to the way he respects his guests, the way he smiles all the time and the way he uses all his magical powers to achieve what we have been eagerly waiting for, that is Sasirekha's marriage with Abhimanyudu.

Srikrishna in this story is the God. He lives along with the human beings maintaining a sense of attachmental detachment with them. He keenly observes the human flaws. Instead of telling them what to do he deliberately creates circumstances out of which the humans can learn life lessons.

Screenplay: Mayabazar has a limp story-line. The narrative has been immensely strengthened by its screenplay. The emotional structure of this screenplay reminds me of Tare Zameen Par. What starts like a pleasant story turns into a tragedy. By the midpoint the audiences feel helpless until Aamir Khan in Tare Zameen Par and Ghatothkacha in Mayabazar arrive. They single handedly remove all the hardships that the protagonists go through each at a step.

Although Mayabazar is a fantasy movie, the first half of it revolves around human drama that still stays true to the contemporary world. Boy and girl falling in Love with each other, parents rejecting their Love, mother slapping her daughter, relatives overlooking our existence as we lose our wealth etc., remain realistic no matter in which times the story is set in. In the first half the audiences are hooked to this drama and then the helplessness caused by this tragic drama will be resolved by the fantasy in the second half otherwise it would have remained just as another VFX gimmick that we are thrown at these days. The Priyadarshini scene in the first half works as a strong set-up for genre shift in the second half. The genre shift is highly motivated by the audiences' desire to see a change in the tragic circumstances.

The story has sub-stories. The story of Sasirekha occupies the major portion of the movie unlike the stories that go from the point of view of Kauravas and Ghatothkacha. These stories are inter-cut among to create engagement. For example as Ghatothkacha invites Abhimanyudu and Subhadra to his home we cut to the scene of Kauravas. The scenic order follows the pattern of either 'cause and effect' or 'irony'. Examples of cause and effect: we cut to the introduction of the Kauravas right after they appear in the Priyadarshini and we cut to the Kauravas getting alert right after the scene in which Balarama gets aggressive about them. Examples of irony: Abhimanyudu takes Sasirekha on a boat ride right after Sasirekha's mother admonishes her for hanging around with Abhimanyudu. The poor Subadhra arrives to Balarama's house right after he promises Kauravas that he'll give Sasirekha to Duryodhana's son.

In a scene Sasirekha gives a tight slap to one of her servents called Chempa. The character Chempa is shown twice before: Once when she informs Sarirekha about Srikrishna's arrival in an impatient tone and the second time when she helps Revathi Devi in insulting Subhadra. Due to these two instances the audiences are subconsciously injected a sense of despise for this character so the slap doesn't feel unjustified. When we frequently see something on screen it registers so strongly in our minds. In Mayabazar, every time we witness the stupidity of Lakshmana Kumara we get to feel how unfit is he to marry Sasirekha and so he is shown in so many scenes. Likewise the Love and tragedy Sasirekha feels for Abhimanyudu is shown too many times because her helplessness has to register firmly for the audiences so that the fantastic things in the second half would feel natural.

Mayabazar has a major dissimilarity with the conventional 3 act structure that these days we follow. In the 3 act structure the protagonist is introduced, given a goal to achieve, he is moved towards the goal and then taken too far away from the goal with a twist in the midpoint, again fueled to move towards the goal and then is finally pushed towards the goal whereas in Mayabazar the audiences are inch by inch taken too far away from the goal in the first half (to an extent of helplessness) and then in the second half pushed towards the goal with a quick momentum. The joy that comes after tragedy has more value. The joy of fooling and punishing the Kauravas right after the audiences feeling absolutely helpless is double-folded than the normal. In Mayabazar the happy scenes in the beginning of the movie have no internal conflict whereas the scenes that lead to the tragedy have internal conflict and the happy scenes as Ghatothkacha enters Dwaraka have no conflict whatsoever.

Dialogues:
"Evaruu puttinchakundaa maatalela pudathay!?"
"Rasapattulo tharkam thagadhu."
"Mukkopaaniki virugudu mukasthuthi undaney undhiga.."

- are my favorite lines from the movie. The dialogue writer could have used all the traditional melodramatic lines as the story was set in Dwapara Yuga but he tries to let it be as contemporary as possible. Famous lyricist and dubbing films' dialogue wrirer Vennela kanti garu speaks beautifully about the dialogues of Mayabazar. To watch it, open this link and go to the 22nd minute and 24th second:

P.S.: The genre films sometimes deviate from the major story to entertain the audiences by giving them what they expect out of the genre. In Mayabazar, the whole 'Gimbali - Gilpam' sequence has no connection with the major story but it still entertains us.

(In the second part I'll come up with the technical analysis of Mayabazar).

--

--

Harish Parthu

I am a film enthusiast. Here I analyse, appreciate and critique (predominantly) Telugu movies in a nuanced fashion.